మరో గంటలో పెళ్లి.. వధువును హత్య చేసిన వరుడు

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి గంట ముందు పెళ్లికూతురు సోని రాథోడ్ దారుణ హత్యకు గురైంది. వరుడు సాజన్ బరయ్యతో పెళ్లి చీర, డబ్బు విషయంలో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఈ ఘోరం జరిగింది. ఆగ్రహానికి గురైన సాజన్, సోనిపై ఇనుప రాడ్డుతో దాడి చేసి, తలను గోడకేసి కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్