త్వరలో పెళ్లి.. ఇంతలోనే తీవ్ర విషాదం

AP: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాయి కృష్ణ, అనిత ఇద్దరూ బావమరదళ్లు కాగా వీరు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోవడంతో త్వరలోనే వీరు పెళ్లిచేసుకోనున్నారు. అయితే వీరిద్దరూ బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో వారు స్పాట్‌లోనే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్