తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ ప్రాక్టికల్స్ పెట్టాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతివారం విద్యార్థులతో ల్యాబ్‌లో ప్రయోగాలు చేయించాలని నిర్ణయించినట్లు బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. ఇప్పటికే ప్రయోగ పరీక్షల అంశాలను వెల్లడించిన బోర్డు.. మరో 15 రోజుల్లో ప్రాక్టికల్స్‌కు సంబంధించిన విధివిధానాలను విడుదల చేయనుంది. కాగా ఎంపీసీ 60 మార్కుల్లో 30. బైపీసీ 120 మార్కుల్లో 60 ఫస్ట్ ఇయర్ కు కేటాయించారు.