ఆఫీసులో రోజంతా కూర్చొని పనిచేయడం, వ్యాయామాలకు సమయం లేకపోవడం వల్ల బరువు పెరిగే సమస్యకు పరిష్కారంగా జపాన్‌లో నాలుగు నిమిషాల్లో పూర్తయ్యే వ్యాయామాలతో కూడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తే కొద్ది రోజుల్లోనే 5 కిలోల బరువు తగ్గొచ్చని వీడియో రూపొందించినవారు చెబుతున్నారు. 'ఎక్స్'లో పోస్ట్ చేసిన ఈ వీడియోను రెండు రోజుల్లోనే 57 లక్షల మంది వీక్షించారు. స్థిరత్వం, చక్కటి ఆహార అలవాట్లు పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని, ఆరోగ్య సమస్యలున్నవారు నిపుణుల సలహాతోనే వ్యాయామాలు చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.