అమర్‌నాథ్ యాత్రకు సర్వం సిద్ధమైంది. బల్తాల్ మార్గం ద్వారా బయల్దేరిన తొలి యాత్రికుల బృందానికి ఘన స్వాగతం లభించింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ వద్ద వద్ద ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాల వద్ద అధికారులు, స్థానికులు యాత్రికులను సాదరంగా ఆహ్వానించారు. యాత్రికుల భద్రత, సంక్షేమం, ప్రయాణం సాఫీగా సాగేందుకు జిల్లా యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ వార్షిక యాత్ర దేశవ్యాప్తంగా తరలివచ్చే భక్తులకు ఒక మధురమైన అనుభూతిగా మారనుంది. ఈ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28న ముగుస్తుంది.