తెలంగాణకు వస్తున్న ప్రధాని మోడీ కి స్వాగతం : మంత్రి పొన్నం

తెలంగాణకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ, హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా, కాంగ్రెస్ నాయకుడిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధానిని ప్రశ్నించారు. గత 12 ఏళ్లుగా రాష్ట్రానికి ఏం చేశారని, 10 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రాన్ని ఎందుకు అడగలేదని నిలదీశారు. ఫెడరల్ వ్యవస్థలో రాజకీయంగా దూరం చేశారని, రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇస్తే అభ్యంతరం లేదని, తెలంగాణకు నిధులు ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధిలో సహకరించడం లేదని, అమరవీరులను అవమానిస్తున్నారని విమర్శించారు. 1966 నుండి అమరవీరుల ఆకాంక్షలను అవమానించేలా మాట్లాడుతున్నారని, తెలంగాణను పాకిస్తాన్ విభజనతో పోల్చుతున్నారని, బీజేపీ తెలంగాణపై అక్కసుతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరవీరులకు కాంగ్రెస్ కారణమని అనడం సరికాదని, 'ఒక ఓటు రెండు రాష్ట్రాలు' అని కాకినాడలో అన్నది మీరే కదా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇంత మంది చనిపోయేవారా అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్