ఆటో కార్మికుల కోసం వెల్ఫేర్ బోర్డు: పొన్నం

TG: ఆటో కార్మికులు, వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ బోర్డును త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీనిపై చట్టసభల్లో చర్చించి, అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. శనివారం ప్రజాభవన్‌లో ఆటో సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో వారి సమస్యలపై చర్చించారు. ‘రాజీవ్ యువ వికాసం’కింద డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు రూ.200Cr కేటాయించామన్నారు. ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల సబ్సిడీ ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕