TG: పేదలకు సంక్షేమ పథకాలు అందాలని సీఎం రేవంత్ అన్నారు. బుధవారం కరీంనగర్‌లో మాట్లాడుతూ.. 'ఉద్యోగులే మా ప్రభుత్వానికి ప్రతినిధులు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేది అధికారులే. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నాం. మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తాం. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చినా.. చెడ్డపేరు వచ్చినా అది ప్రభుత్వ ఉద్యోగుల వల్లే' అని అన్నారు.