‘తమ్ముడు’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

నితిన్ ప్రధాన పాత్రలో దిల్‌రాజు నిర్మించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సుమారు రూ.75కోట్లతో నిర్మించిన ఈ మూవీకి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3కోట్లు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో రూ.2కోట్ల కలెక్షన్లు వచ్చాయని వెల్లడించాయి. ఈ చిత్రానికి మొదటిరోజు 27వేల లోపే టికెట్లు అమ్ముడుపోయాయని పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్