'రాజాసాబ్' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన 'రాజాసాబ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. జనవరి 9న గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా భారత్ లో రెండు రోజుల్లో రూ.108.4కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు Sacnilk వెబ్ సైట్ పేర్కొంది. ప్రీమియర్లకు రూ.11.3Cr, తొలి రోజు రూ.64.3Cr, రెండో రోజు రూ.32.84Cr కలెక్షన్స్ సాధించినట్లు వెల్లడించింది. హిందీలో 2 రోజుల్లో రూ.11.2Cr రాబట్టినట్లు తెలిపింది. కాగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.112Cr+ గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్