పదేళ్లు KCR కుటుంబం దోచుకుంటుంటే కిషన్‌రెడ్డి ఏం చేశారు: MP చామల

కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే కిషన్‌రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. 'కేసీఆర్ కుటుంబంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా?.. కిషన్‌రెడ్డి కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు తెలుసు' అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అవినీతి, కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు జరగట్లేదన్నారు. కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఏనాడైనా తెలంగాణ గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్