TG: సృష్టి ఫెర్టిలిటీ కేసులో సరోగసీ ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ నమ్రతను పోలీసులు మొదటి రోజు కస్టడీకి తీసుకొని విచారించారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో 5 గంటలపాటు విచారించగా.. అధికారులు వేసిన ప్రశ్నలకు ఆమె సైలెంట్‌గా ఉండడంతో విచారణ ఉత్కంఠగా మారింది. తాను అస్సలు తప్పు చేయలేదని నమ్రత సమాధానం ఇచ్చారు. అయితే ఏజెంట్లు, ANMలు, ఆశా వర్కర్ల పాత్రపై పోలీసులు ఆమెను వివరాలు కోరారు.