TG: యాదాద్రి జిల్లా మోటకొండూరులో ఆదివారం మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పాలనతో ఏ వర్గానికీ లాభం లేదు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు.. ఏమైంది? 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఆపేశారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క కాల్వ కూడా తవ్వలేదు' అని విమర్శలు గుప్పించారు.