చెన్నైలోని అడయార్‌లో గాల్లో ఎగురుతూ నేల రాలుతున్న కాకుల ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇందిరానగర్ పార్కులో కొద్ది రోజులుగా ఇలా జరుగుతోంది. ఎగరలేని స్థితిలో ఉన్న కాకులు ఒకటి రెండు రోజుల్లో చనిపోతున్నాయి. ఇది ఏదైనా వైరస్ వల్ల జరుగుతోందని, తమకు కూడా హాని కలుగుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.