ఆగస్టు 15న దేశం త్రివర్ణ పతాకంతో మురిసిపోతుంది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి రాజకీయ స్వాతంత్ర్యం సాధించిన భారత్ 79 ఏళ్లలో ఎన్నో రంగాల్లో పురోగతి సాధించింది. అయితే సామాజిక న్యాయం, సమానత్వం, ఆర్థిక స్వేచ్ఛ ప్రతి పౌరుడికి పూర్తిగా అందాయా? అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. నిరుద్యోగం, పేదరికం, కుల వివక్ష, రైతు సమస్యలు, విద్యా-వైద్య అసమానతలు కొనసాగుతున్నాయి. డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనల ప్రకారం పాలకులు మారడం మాత్రమే స్వాతంత్ర్యం కాదు.. సమాజం మారాలి. అంటే మహిళలపై చిన్న చూపు పోవాలి. అత్యాచారాలు తగ్గాలి. అన్ని రంగాల్లో స్త్రీలు ఎదగాలి. కులం పేరుతో కాకుండా, టాలెంట్‌ని చూసి ఉద్యోగాలు రావాలి. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన గౌరవం లభించాలి. అప్పుడే స్వాతంత్ర్యం సంపూర్ణమవుతుంది.