హిమోగ్లోబిన్ అంటే ఏమిటి.. అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా?

సాధారణ రక్త పరీక్షల్లో ఒకటైన సీబీపీ ద్వారా హిమోగ్లోబిన్ స్థాయి తెలుసుకోవచ్చు. ఎర్ర రక్త కణాల్లోని ఈ ప్రోటీన్ ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరంలోని ప్రతి కణానికి చేరవేస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గితే అలసట, బలహీనత, తలనొప్పి, శ్వాస ఇబ్బందులు, ఛాతిలో నొప్పి, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, ఈ లక్షణాలు గమనించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం.

సంబంధిత పోస్ట్