తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి?

ఏడాదిపొడవునా ప్రతి 15 రోజులకు ఓసారి వచ్చే ఏకాదశిలు అన్నీ ప్రత్యేకమే.. అయితే వాటిలో తొలిఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత వేరు. ఆషాడ ఏకాదశి జూలై 17 తెల్లవారుజామున 3.18 గంటలకు మొదలై జూలై 18 తెల్లవారుజామున 2.42 గంటలకు సమాప్తం అవుతుంది. ఆ రోజున భక్తులు మహావిష్ణువు ప్రార్థిస్తూ ఉపవాసం చేస్తారు. ఆ రోజు నుండే చాతుర్మాసం మొదలవుతుంది. ఆ రోజు నుంచి మహావిష్ణువు పాలసముద్రంలో నాలుగు నెలలపాటు విశ్రాంతి తీసుకుంటాడని భక్తులు నమ్ముతారు.

సంబంధిత పోస్ట్