బీసీ ఉద్యమంతో కవితకు ఏం సంబంధమని ఎమ్మెల్సీ మల్లన్న ప్రశ్నించారు. తన కార్యాలయంపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు. ‘కంచెం పొత్తు, మంచం పొత్తు అంటే తెలంగాణ భాషలో వియ్యం అందుకోవడం అనే అర్థం. వారి భాషలో వేరే ఏదైనా అర్థాలు ఉన్నాయేమో మాకు తెలీదు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే సంబరాలు చేసుకోవాల్సింది మేము. ఈ దాడితో భయపడను. ఏ విధంగా ముందుకు వెళ్లాలో మాకు తెలుసు’ అని తీన్మార్ మల్లన్న అన్నారు.
CREDITS: BIGTV