2024లో తిరుమల శ్రీవారి మొత్తం ఆదాయం ఎంతంటే?

2024 ఏడాదిలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి వచ్చిన మొత్తం హుండీ ఆదాయం వివరాలను టీటీడీ అధికారులు (TTD) మంగళవారం వెల్లడించారు. ఈ ఏడాది శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇక గత ఏడాది రూ.1,398 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ. 33 కోట్ల ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు. 2024లో శ్రీవారిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్