ఇరాన్‌పై సైనిక చర్యలు నిలిపివేసే తీర్మానానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలపడంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. 'ట్రూత్ సోషల్' వేదికగా ఆయన మాట్లాడుతూ, "ఈ తీర్మానానికి అనుకూలంగా నలుగురు రిపబ్లికన్‌లు, డెమొక్రాట్లందరూ ఓటు వేశారు. ఇరాన్‌తో చివరి దశ చర్చలు సాగుతున్న వేళ నా అధికారాలను పరిమితం చేయాలనే ఉద్దేశంతో అర్థం లేకుండా ప్రవర్తించారు. ఇంతటి దేశద్రోహం ఎవరు చేస్తారు? ఆ నలుగురు రిపబ్లికన్లు వాళ్ల చేష్టలకు సిగ్గుపడాలి" అని ట్రంప్ అన్నారు. ఈ తీర్మానం దేశద్రోహంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు.