స్పై కెమెరా కనిపించినా వెంటనే కెమెరాను తాకకండి. ఎందుకంటే.. దానిపై నిందితుల ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఉపయోగపడతాయి. అయితే కెమెరాలు కనిపించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసులు వచ్చేదాకా అక్కడే ఉండాలి. ఇంకా కెమెరా ఉన్న ప్రదేశం ఫోటోలు లేదా వీడియో తీసి ఆధారంగా ఉంచుకోవాలి. హోటల్/షాప్ సిబ్బందికి తెలియజేయాలి, కానీ వారు దాచడానికి ప్రయత్నిస్తే అప్రమత్తంగా ఉండాలి.