TG: బెంగళూరు నుంచి HYDకి ఎక్స్ ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ ని కూడా మంజూరు చేయించుకున్నామని, అందుకు కేంద్రం ప్రాథమికంగా ఒప్పుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాటి గురించి ఢిల్లి వెళ్లి ప్రధాని మోదీని కలుస్తానని ఆయన తెలిపారు. కేంద్రం గుజరాత్‌కు ఇచ్చినవి తెలంగాణకు కూడా ఇవ్వాల్సిందేనని, లేదంటే రాష్ట్రంలో BJPని నేలమట్టం చేస్తానని సీఎం రేవంత్ హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్తగా 4 విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ నెలాఖరులో వరంగల్ ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తామణి అన్నారు.