పెట్రోల్ కోసం బంక్‌కు వెళ్తే.. బైక్ మాయం

TG: మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో పెట్రోల్ బంక్‌లో చోరీ కలకలం రేపింది. పెట్రోల్ కొరతతో బంక్‌ల వద్ద రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో మీ సేవ కేంద్ర నిర్వాహకుడు అమర్‌నాథ్ పెట్రోల్ కోసం బైక్‌పై బంక్‌కు వెళ్లగా, రద్దీ కారణంగా బయట పార్క్ చేసిన అతని బైక్ మాయమైంది. సుమారు 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి చూసేసరికి బైక్ కనిపించలేదు. ఆందోళనకు గురైన అమర్‌నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్