స్వాతంత్ర్యం వచ్చినప్పుడు గ్రాము బంగారం ధర 88 పైసలు

స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947తో పోలిస్తే ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. అప్పట్లో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.88 ఉండగా (గ్రాము 88 పైసలే).. ఇప్పుడు సుమారు రూ.1.55 లక్షలకు చేరింది. లీటర్ పాలు 12 పైసల నుంచి రూ.68కు, కిలో బియ్యం 12 పైసల నుంచి రూ.60కు పెరిగింది. అలాగే లీటర్ పెట్రోల్ ధర 27 పైసల నుంచి రూ.115కు చేరింది. గత 79 ఏళ్లలో ధరల పెరుగుదల ఎంతగా ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆదాయాలు కూడా పెరిగినప్పటికీ, నిత్యావసరాల ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మరింత పెంచింది.

సంబంధిత పోస్ట్

✕
✕