మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'మన శంకర వరప్రసాద్‌గారు'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 4న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.