తెలంగాణలో 'చేయూత' పింఛన్ల మంజూరు ఎప్పుడంటే?

తెలంగాణలో కొత్తగా 'చేయూత' పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 4.50 లక్షల మందికి పైగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ నెలలోనే అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేయనున్నారు. అనంతరం కొత్త పింఛన్ల మంజూరు, పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మందికి కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత పోస్ట్