'రైతు భరోసా' పడేది ఎప్పుడు.. ప్రభుత్వం నుంచి రాని స్పష్టత!

తెలంగాణలో యాసింగి సీజన్ మొదలు కావడంతో 'రైతు భరోసా' పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే రైతు ఖాతాల్లో రైతు భరోసా నిధులు(ఎకరానికి రూ.6000) జమ చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా.. ఇప్పటివరకు రైతు ఖాతాల్లో నిధులు జమ కాలేదు. దీనిపై మళ్లీ ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా సీఎం చెప్పినా.. రైతు భరోసా విడుదల కాలేదంటే.. ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని BRS, BJP నేతలు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్