కచ్చతీవు ద్వీపం ఎక్కడుంది?

తమిళనాడులోని రామేశ్వరం దీవికి సమీపంలో కచ్చతీవు దీవి ఉంది. భారత్‌-శ్రీలంకను వేరుచేస్తున్న పాక్‌ జలసంధిలో ఈ దీవి ఉంది. ఈ జలసంధి రెండుదేశాలకు సరిహద్దుగా ఉంటోంది. కచ్చతీవు దీవి చాలా చిన్నది. అక్కడ ఎవరూ ఉండరు. అయితే దీని పరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. దీంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట సాగిస్తుంటారు. కచ్చతీవులో సెయింట్ ఆంటోనీ అనే చర్చి ఉంది. ఏటా జరిగే జాతరలో తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్