వైట్ కోబ్రా.. ఈ గుర్రం ధర రూ.1.71 కోట్లు (వీడియో)

మహారాష్ట్రలోని నందూర్‌బార్‌లో జరుగుతున్న చేతఖ్‌ పశువుల సంతలో రెండు గుర్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పంజాబ్‌కు చెందిన జగ్‌తార్ సింగ్ తన వైట్ కోబ్రా అనే తెల్ల గుర్రాన్ని రూ.1.71 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. నుక్రా జాతికి చెందిన ఈ గుర్రం 61 అంగుళాల ఎత్తు ఉంది. రాజేంద్ర యాదవ్ తన గోధుమ రంగు రుద్రాణి అనే గుర్రాన్ని రూ.1.17 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. మార్వారి జాతికి చెందిన ఈ గుర్రం 65 అంగుళాల ఎత్తు ఉంది. వైట్ కోబ్రా కోసం నెలకు రూ.75వేలు, రుద్రాణికి ప్రతి రోజు ఎనిమిది లీటర్ల ఆవు పాలు ఖర్చు చేస్తున్నట్లు యజమానులు తెలిపారు.

సంబంధిత పోస్ట్