చిన్న వయసులోనే తెల్ల జుట్టు.. కారణాలు, నివారణ మార్గాలు ఇవే!

ఇటీవల కాలంలో చిన్న వయసులోనే చాలామంది తెల్ల వెంట్రుకలతో కనిపిస్తున్నారు. వాతావరణ మార్పులు, విటమిన్ లోపం, జన్యుపరమైన కారణాలు, అధిక ఒత్తిడి, నిద్రలేమి, థైరాయిడ్ సమస్యలు, పోషకాహార లోపం, కెమికల్ హెయిర్ ప్రోడక్ట్స్ వాడకం, ధూమపానం, మద్యపానం వంటివి దీనికి కారణాలుగా వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం వల్ల నల్ల జుట్టు తెల్లగా మారుతుందని, ఇది ఎర్ర రక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి, కణాల పునరుత్పత్తికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. నివారణకు ఆకుకూరలు, పండ్లు, పప్పులు, గుడ్లు, పాలు, చేపలు వంటివి తీసుకోవాలని, తగినంత నీరు తాగడం, ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయడం మంచిదని సూచించారు. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడితే ముందుగా వైద్యులను సంప్రదించి, అసలు లోపాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలని సలహా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్