చాందీపురా వైరస్ గురించి ఓ వైద్యుడు వివరించారు. 'చందీపురా అనేది మహారాష్ట్రలోని ఒక గ్రామం. 1965లో ఇక్కడ తొలి కేసు నిర్ధారణ అయింది. జ్వరం, తలనొప్పి, విరేచనాలు దీని లక్షణాలు. కాగా తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ, స్పృహ కోల్పోవడం, మరణం సంభవించవచ్చు. ఇసుక ఈగలు, పేలు, దోమల వల్ల సోకుతుంది. ఇది అంటువ్యాధి కాదు. 9 నెలల- 14 ఏళ్ల పిల్లలపై అధిక ప్రభావం ఉంటుంది. దీనిని నిరోధించేందుకు వ్యాక్సిన్ లేదు' అని తెలిపారు.