బంగారం ధరలు ఎలా నిర్ణయిస్తారు? ఆసక్తికర విషయాలు ఇవే!

భారతదేశంలో బంగారం ధరలు కేవలం ఒకే సంస్థ నిర్ణయించదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, డాలర్-రూపాయి మారకం విలువ, ప్రపంచ డిమాండ్, వడ్డీ రేట్లు, ప్రభుత్వ విధానాలు వంటి అనేక అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు బంగారం దిగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. స్పాట్ ధర, LBMA ధర, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధరల ఆధారంగా అల్గారిథమ్‌ల సహాయంతో ధరలు నిర్ణయించబడతాయి. ఆ తర్వాత దిగుమతి సుంకం, జీఎస్టీ వంటి పన్నులు జోడించి భారత మార్కెట్‌లో తుది ధరను ఖరారు చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్