మా కడుపుకోత తీర్చేది ఎవరు.. ఆసుపత్రి వద్ద చిన్నారి తండ్రి ఆవేదన

TG: ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఇప్పటివరకూ ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సమాచారం మేరకు రిమ్స్ ఆసుపత్రికి అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కలెక్టర్ రాజర్షి షా వద్దకు వచ్చిన మృతి చెందిన ఓ చిన్నారి తండ్రి తన గోడు వెళ్లబోసుకున్నాడు. '5 రోజుల నా బిడ్డ చనిపోయింది. మా కడుపుకోత తీర్చేది ఎవరు. మిగతా పిల్లలు చాలా  బాధలో ఉన్నారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఒక డాక్టర్ మాత్రమే ఉన్నాడు' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్

✕
✕