కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నర్సు నిమిష ప్రియ 2011లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లారు. 2014లో యెమెన్‌లో యుద్దం కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చారు నిమిషా ప్రియ.. భర్త , కుమార్తె, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి యెమెన్ లో ఉండిపోయారు. ఆ దేశ చట్టం ప్రకారం అక్కడ క్లీనిక్ తెరవాలనుకుంటే యెమెన్ జాతీయుడితో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి. దీంతో తలాల్ అబ్దో మహదీతో నిమిష వ్యాపారం ప్రారంభించింది.