ఎన్టీపీసీ 1600 మెగావాట్ల ప్లాంటుకు ఎందుకు నో చెప్పారు: హరీశ్ రావు

TG: ఎన్టీపీసీ కడతామన్న 1600 మెగావాట్ల ప్లాంటుకు ఎందుకు నో చెప్పారని మాజీమంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్లాంట్ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగపడేది కదా అని అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సింగరేణి నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంట్ ఇచ్చే కరెంట్ వద్దన్నారన్నారు. విద్యుత్‌ కోసం రాజస్థాన్‌తో పీపీఏ చేసుకున్నారని, రాష్ట్ర అవసరాలను కాదని, రాజస్థాన్‌కు కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕