ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో కేకేఆర్ భారీ స్కోరు సాధించినా ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ రికార్డు ధర రూ.25.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కామెరాన్ గ్రీన్‌తో బౌలింగ్ ఎందుకు చేయించలేదనే ప్రశ్న తలెత్తింది. దీనిపై కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ, 'గ్రీన్‌తో ఎందుకు బౌలింగ్ చేయించలేదనే విషయం మీరు క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాలి' అని వ్యాఖ్యానించాడు. ఇది క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన పనిభారం ఆంక్షల వల్లేనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.