ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడం చాలా ఖర్చుతో కూడుకున్నదైనా.. కేంద్రం మారుస్తూనే ఉందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. పథకాల పేర్లను మార్చడం అంటే మోదీ ప్రభుత్వానికి ఎందుకంత ఇష్టమో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎంజీ నరేగా చట్టం పేద ప్రజలకు 100 రోజుల ఉపాధి హామీ కల్పిస్తోంది. ఈ కొత్త బిల్లుతో ప్రస్తుత చట్టాన్ని బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారు. పని దినాలను పెంచారు. వేతనాన్ని పెంచారా?’’ అని ప్రియాంక ప్రశ్నించారు.