భారతదేశంలో డయాబెటిస్ ఒక సాధారణ సమస్య. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి గల కారణాలను నిపుణఉలు వివరిస్తున్నారు. డాన్ ఫినామినా, సోమోగీ ప్రభావం, మందులు వేసుకునే సమయం, ఇన్సులిన్ వాడకంలో పొరపాట్లు, దాగివున్న చక్కెరలు, కనిపించని ఇన్ఫెక్షన్లు వంటివి కారణాలుగా పేర్కొన్నారు. అకస్మాత్తుగా షుగర్ పెరిగితే చేతులు కడుక్కోవడం, నీళ్లు తాగడం, సొంత వైద్యం చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీవ్ర లక్షణాలు కనిపిస్తే తక్షణం ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.