పురుషులలో Y క్రోమోజోమ్‌ ఎందుకు తగ్గిపోతుంది?.. క్యాన్సర్‌తో సంబంధం ఏంటి?

వయసు పెరుగుతున్న కొద్దీ కొందరు పురుషుల కణాల్లో Y క్రోమోజోమ్‌ కోల్పోయే మార్పు కనిపిస్తుంది. దీనిని ‘లాస్‌ ఆఫ్‌ వై క్రోమోజోమ్‌’ అంటారు. యూనివర్సిటీ ఆఫ్‌ అరిజోనా పరిశోధకులు 405 మంది పురుషులకు చెందిన దాదాపు 1,000 కణజాల నమూనాలను పరిశీలించగా.. కొన్ని క్యాన్సర్ల చుట్టుపక్కల సాధారణ కణజాలాల్లోనూ Y క్రోమోజోమ్‌ నష్టం గుర్తించారు. ముఖ్యంగా కొలొన్‌, రెక్టల్‌, ఆహార నాళం, ప్యాంక్రియాటిక్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్లలో ఈ మార్పు కనిపించింది. అయితే Y క్రోమోజోమ్‌ నష్టమే నేరుగా క్యాన్సర్‌కు కారణమని చెప్పడానికి ఆధారాలు లేవు. భవిష్యత్తులో క్యాన్సర్‌ ప్రమాదాన్ని గుర్తించే జీవసంబంధ సంకేతంగా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕