‘నీ ఫ్రెండ్‌కు మార్కులు ఎక్కువ వచ్చాయి. నువ్వు ఇంకా బాగా చదవాలి’ అని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి తెస్తుంటారు. ఎంత ఒత్తిడి చేస్తే అంత చదువుకి దూరంగా ఉంటారు. బలవంతం చేయడం కంటే సరదాగా చదివేలా ప్రోత్సహించి చూడండి. ఎప్పుడూ పాఠ్య పుస్తకాలే కాకుండా అప్పుడప్పుడు కామిక్ బుక్స్‌నీ చదివించండి. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ఆసక్తి ఉండొచ్చు. పిల్లలకి అలాంటి పుస్తకాలు చదివిస్తే పాఠ్యపుస్తకాలనూ ఇష్టంగా చదువుతారు.