దీపావళి సమయంలో లక్ష్మీదేవితో పాటు హనుమంతుడిని కూడా కొన్ని ప్రాంతాల్లో పూజించే సంప్రదాయం ఉంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, శ్రీరాముడి పట్ల హనుమంతుడి నిస్వార్థ భక్తికి మెచ్చిన రాముడు దీపావళి రోజున తనతోపాటు హనుమంతుడిని కూడా పూజిస్తారని వరమిచ్చినట్లు కథనం. నరక చతుర్దశి రోజున హనుమంతుడిని ఆరాధిస్తే భయాలు, ప్రతికూల శక్తులు తొలగి ధైర్యం, ఆరోగ్యం, శాంతి లభిస్తాయని భక్తుల నమ్మకం. కొన్ని ఆలయాల్లో ఈ రోజున హనుమాన్ జయంతి వేడుకలు కూడా నిర్వహిస్తారు. శివుడి రుద్ర అవతారంగా భావించే హనుమంతుడిని పూజిస్తే శివ, విష్ణువుల అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.