ఏడాదిన్నరగా బీసీ సమస్యలపై తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తున్నామని MLC కవిత అన్నారు. ఏ రోజూ తీన్మార్ మల్లన్నను ఒక్క మాట కూడా అనలేదని చెప్పారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు పరుషపదజాలంతో విమర్శలు చేస్తే రాజకీయాల్లోకి వచ్చే మహిళకు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది. ఉచ్ఛరించలేని దారుణమైన వ్యాఖ్యలను మల్లన్న చేశారు. ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావద్దా? ఏం మాటలివి? మల్లన్నకు నాపై కోపం ఎందుకు?' అని ప్రశ్నించారు.