టీమ్‌ఇండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కి నవంబర్ 15 ప్రత్యేకమైన రోజు. 1989లో ఇదే రోజు, 16 ఏళ్ల వయసులో కరాచీలో పాకిస్థాన్‌పై తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులకు ఔటయ్యాడు. ఆశ్చర్యకరంగా, సచిన్ చివరిసారి బ్యాటింగ్ చేసిన రోజు నవంబర్ 15నే. 2013లో వాంఖడే వేదికగా వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో 118 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇది ఆయన చివరి అంతర్జాతీయ ఇన్నింగ్స్. ఈ విషయాన్ని బీసీసీఐ (BCCI) సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.