TG: గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఎందుకు నోరు మెదపడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై నారా లోకేశ్ రేవంత్ రెడ్డి బలం చూసుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ తమ చేతుల్లో ఉందని.. తాము ఏం చెప్తే ఆది చేస్తారనే ధైర్యంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.