ఆషాఢ మాసంలో అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?

ఆషాఢంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం వెనుక ఆరోగ్యపరమైన కారణాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఆషాఢంలో వర్షాలు ఊపందుకోవడంతో భూమి తడిగా మారుతుంది. ఈ సమయంలో పొలం పనులు, ఏరులు దాటి వెళ్లే వాళ్లకు చేతులు, కాళ్లు నిరంతరం తడుస్తుంటాయి. ఫలితంగా చర్మవ్యాధులతో పాటు గోళ్లు దెబ్బతింటాయి. గోరింటాకులోని యాంటీ సెప్టిక్ గుణాలు చర్మవ్యాధులు, గాయాలకు సహజ చికిత్సగా పని చేస్తుంది. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు.

సంబంధిత పోస్ట్