తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఏర్పడిన ద్రోణుల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ ఆకాశం పూర్తిగా మేఘావృతమై చల్లటి వాతావరణం నెలకొంది. రాబోయే గంటల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. తెలంగాణలో వచ్చే ఏడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.