ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన అంజలి తన ప్రియుడితో కలిసి భర్తను తుపాకీతో కాల్చి చంపింది. అంజలి, తన భర్త రాహుల్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేది. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్. నీ భర్త మాత్రం అంకుల్‌లా ఉన్నాడు’ అని ఓ రీల్‌కు కామెంట్ వచ్చింది. అది చూసి అంజలి సహించలేకపోయింది. అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి చంపాలని ప్లాన్ చేసింది. రాహుల్‌ని పొలానికి పిలిచి కాల్చి చంపింది.