భర్త గ్యాస్ తేలేదని.. భార్య ఆత్మహత్యాయత్నం

AP: భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటు చేసుకుంది. తొండపాడులో హరికృష్ణ, మహాలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోయిందని, సిలిండర్ తేవాలని మహాలక్ష్మి 3 నెలలుగా చెబుతోంది. డబ్బులు లేవన్న కారణంతో అతను సిలిండర్ తీసుకురాలేదు. తాను ఎంత చెప్పినా భర్త మాట వినకపోవడంతో ఇంట్లో ఫినాయిల్ తాగి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్