తాగి వేధిస్తున్న భర్తను కర్రతో కొట్టి చంపిన భార్య

TG: పెద్దపల్లి జిల్లాలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం సేవించి వేధిస్తున్న భర్త శ్రీనివాస్‌ను భార్య పుష్పలత కర్రతో తలపై కొట్టి చంపింది. జిల్లాకేంద్రంలోని హనుమాన్ నగర్ నివాసులైన ఈ దంపతుల్లో, శ్రీనివాస్ జులాయిగా తిరుగుతూ మద్యానికి డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. నిత్యం మద్యం మత్తులో భార్యాపిల్లలను హింసించడంతో విసిగిపోయిన పుష్పలత.. అర్ధరాత్రి భర్తపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్