యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో భార్య చేతిలో మరో భర్త దారుణంగా హత్యకు గురయ్యాడు. మహేశ్, పూజా భార్య భర్తలు. పూజకు ఇంటి సమీపంలోని దంగర్ యాదవ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా.. మహేష్ చూశాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి మహేశ్‌ను చంపేశారు. అనంతరం ఏమి తెలియనట్లు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.